Sunday, October 23, 2011

Physics of the Future - Michio Kaku


"The handsome and the beautiful may earn the admiration of the society, but all the wondrous inventions of the future are a byproduct of the unsung, anonymous scientists"  అన్నమాట నిజమనిపిస్తుంది ఈ పుస్తకం చదివితే. Jules Verne అనే ఫ్రెంచిదేశపు కాల్పనికరచయిత Paris au XXe siècle అనే పుస్తకంలో 1960నాటికి సాధ్యమవగల glass sky scrappers, air conditioning, TV, elevators, high-speed trains, gasoline powered automobiles even something resembling the Internet"లు 1960కలా సాధ్యమవుతాయని ఊహించారట. నిజానికీ పుస్తకం 1863లో రాయబడిందట ఆ manuscript 1994 వరకూ అజ్ఞాతంగా వుండిపోయిందట. ఆయన మనవడనుకుంటాను 1994లో దాన్ని ముద్రణకై విడుదలచేస్తే యావత్ప్రపంచమూ నివ్వెరపోయిందట ఆరచయిత ఊహ నిజానికెంత దగ్గరగా వుందోనని. ఈయనే De la Terre à la Lune అనే ఇంకొక పుస్తకంలో చంద్రుడిమీదకి మనం మనుషులు నిర్వహించగల ఒక యాత్రగురించి వర్ణించగా ఆవర్ననలన్నీ 1969లో జరిగిన Appolo Mission కు సరిపోలాయట.నిజానికీ పుస్తకం 1865లో వ్రాయబడిందట! ఈయన్నే స్పూర్తిగా తీసుకొని ఒక శాస్త్రీయ ధృక్కోణంతో, ఒక శాస్త్రవేత్త రాసిన పుస్తకం ఇది. 

Mass technology evolutionలో నాలుగు దశలుంటాయట. Stage-Iలో టెక్నాలజీ ద్వారా ఉత్పన్నమైన వస్తుశ్రేణి చాలా కొద్దిమందికి మాత్రమే అందుబాటులోవుంటుందట. Paper ఈజిప్ట్‌లో కనుగొనబడినప్పుడు, దాన్ని కేవలం పురోహితవర్గమ్మాత్రమే వాడగలిగేవారట అదికూడా మతపరమైన కారణాలకే. Stage-II అనగా సమాన్యులకందుబాటులోకిరావడం. Paper విషయంలో ఇది Gutenberg ముద్రణాయంత్రాన్ని కనుగొన్నాక జరిగిందట అంటే 1450 పరిసరాల్లో. అప్పటివరకూ ప్రపంచంలో వున్నమొత్తం పుస్తకాల సంఖ్య 30,000 కాగా క్రీ.శ.1500 నాటికి  వాటి సంఖ్య తొమ్మిది లక్షలకు చెరుకుందట!! ఆతరువాతనే personal book అనే ఒక కాన్సెప్ట్ జనాలకి పరిచయమయ్యిందట. Stage-IIIలో ఖర్చు మరింతగా పడిపోయి అది invisible and ubiquitos అన్న స్థాయికి చేరుకుంటుందట. పేపర్ విషయానికొచ్చేస్సరికి ఈ స్థాయిలో  personal library సాధ్యమయ్యిందట. Stage-IVలో అది ఒక అలంకరణ వస్తువుగానూ, తర్వాత్తరువాత వ్యర్ధంగానూ మారిపోతుందట. ప్రస్తుతానికి "largest source of urban wastage is paper" అంటూ. పేపర్ విషయంలో మనమున్నది నాలుగవ దశ అంటాడు. ఇలాంటి దశల్ని విద్యుత్తు, కంప్యూటరు వంటివాటి విషయంలోకూడా గమనించవచ్చంటూ, ఇలా ఇలా prized technology నుంచి utilityగా పరిణమించే ఈదశలన్నీ electronic chips విషయంలోనూ, semi conductors విషయంలోనూ చేరుకుంటాము, తరువాత తరచుగా వైద్యులను కలుసుకోవాల్సిన అవసరంలేకుండానే, అప్పాయింట్‌మెంట్లకోసం పడిగాపులుపడాల్సిన అవసరంలేకుండానే ఇంట్లోనే మనం MRI scan లాంటివి చేసేసుకొని,  ఇంట్లోనే వాటిని పరిశీలించేసుకోవచ్చు, నిజానికి ప్రతివస్తువులోనూ ఒక chipని అమర్చి వాటిని మెదడుకు అనుసంధానంచేసి, ఆలోచనామాత్రంగానే ఆ వస్తువుల గమనాన్ని అదుపులోపెట్టగల telekinetic powers మనకి చి, పురాణగాధల్లో దేవతలకి మాత్రమే సాధ్యపడిన అద్భుతాలు మనంకూడా నిజజీవితంలో చెయ్యగలుగుతాము అంటాడు రచయిత

వైద్యరంగంలో వచ్చే విప్లవాత్మక మార్పులు మన ఆయుష్షుని గణనీయంగా పెంపొందించడమేగాక మనిషి నూరేళ్లకు పైబడికూడా యవ్వనవంతునిగా జీవించగలుగుతాడు, క్లోనింగ్, artificial growth of the limbs in the lab వంటివాటితో తెగిపోయిన,పాడైపోయిన అవయవాలను తిరిగి అమర్చగలిగినప్పటికీ, అన్నివ్యాధులనూ మానిపించగలగటం మాత్రం సాధ్యం కాదట :( . ఇదొక్కటీ మినహాయిస్తే మరణాన్నికూడా వాయిదావెయ్యగల స్థాయికి మనం 2100 నాటికి చేరుకుంటామట.

యంత్ర పరికరాల గురించి చెబుతూ... భవిష్యత్తులో self replicate చెసుకోగల machines ఎల్లెడలా ప్రత్యక్షమైపోయి, ప్రతి పరిశ్రమలోనూ మానవుల్ని replace చెయ్యగలుగుతాయట. అప్పటికీ మానవ మేధస్సును, ఇంఙితం యంత్రాలకి సాధ్యంకాదు కాబట్టి, కేవలం common sense అవసరమయ్యే రంగాలు మాత్రం మానవుల ఆధీనంలో వుంటాయట. అంటే కళాకారులు, లాయర్లు, ప్రోగ్రామర్లు, సృజనాత్మక రంగాలకు చెందిన వాళ్ళు ఇలాగన్నమాట. ఈ self replicating capabilities ఉన్న nanobots అంతరిక్షంలోని సుదూరతీరాల్లో మానవ నివాసయోగ్యమైన గ్రహాలకోసం వెదుకుతూవుండగా, శతాబ్దాంతానికి Mars మీడ మానవవలసలు సాధ్యమవ్వొచ్చట. 

శక్తి వనరులగురించి మాట్లాడుతూ. భవిష్య ఇంధనాలుగా కేంద్రకసంలీనంగానీ, anti-matter గానీ చలామణీలోకి వస్తాయట. కేవలం ఒక స్పూను anti-matterతో ఏకంగా Mars దగ్గరకి ఒక రాకెట్‌ని పంపించగలమట!!! ఈ శతాబ్దాంతానికి fusion reactors సాధ్యమయ్యేఅవకాశాలుండగా, anti-matter విషయంలో మాత్రం anti-universe కంటబడేంతవరకూ వరకూ ఆగక తప్పదట. Automobile రంగంలోకొస్తే... room temparature super conductors కల సాకారమయ్యి, magnetic leviation technique ని వాడుకొని కార్లన్నీ గాల్లో ప్రయాణిస్తుంటయట. అప్పుడు ఘర్షణను అధిగమించడాల్సిన అవసరమేవుండదుకాబట్టి, అతికొద్ది ఇంధనంతో ఎక్కువదూరాలను ప్రయాణించడం సాధ్యమవుతుందట.

చివరగా Fate of the humanity అన్న chapterలో.. "The saddest aspect of society right now is that science gather knowledge faster than the society gathers wisdom. అన్న Issack Assimov మాటలతో మొదలుపెట్టి. మనం గనుక 2100 నాటికి Nikolai kardashev చెప్పిన Type-I civilization (aka planetory civilization) స్థాయికి చేరుకోలేకపోయినట్లయితే మనల్ని మనమే ఒక అణుయుధ్ధంలోనో, గ్లోబల్‌వార్మింగ్ వల్లనో నాశనంచేసేసుకుంటాం అంటాడు. అయితే ప్రస్తుతం దేశాలేర్పరుచుకుంటున్న వాణిజ్య కూటములు (అందులో పెద్దది EU) ఈదిశలో మనంవేస్తున్న తొలి్అడుగులుగా భావించవచ్చంటాడు. ఈ దేశాల హద్దులన్నీ మర్చిపోయి మనమందరమూ 'విశ్వనరుని' స్థాయికిఎదగలేకపోతే, అందరమూ కలిసి అణుశక్తిని, ఉత్పాతానికి దారితీయగల పరిణామాలనూ అదుపులోఉంచకపోతే పుట్టగతులుండవన్న హెచ్చరికతో పుస్తకాన్ని ముగిస్తాడు రచయిత.

Martian colonies, future energy sources, extending the life span, future of nanotechnology,   future of artificial intelligence, solar sails అన్నవిషయాల్లో రచయిత వాదనలు చాలా logicalగా వుంటాయి బాగా informative కూడా. ఎందుకు కేంద్రకవిచ్చినంకన్నా కెంద్రకసంలీనం క్షేమకరమైనది?, అసలు Chernobyl, Three Mile Island లలో ఏంజరిగింది? కేంద్రసంలీనాన్ని సాధించడంలో ప్రస్తుతం శాస్త్రవేత్తలెదుర్కొంటున్న సవాళ్ళేమిటి అనేప్రశ్నలకు సమాధానమిచ్చినతీరు చాలాచాలా బాగుంది. Oxygen toxicity ప్రభావాన్ని, free radical formation rate(వీటి ప్రస్తావన ఈమధ్యే చదివిన The Immortals of Meluha పుస్తకంలో సోమరసం ఎలా పనిచేస్తుంది అని బృహస్పతి, శివుడికి వివరించే సమయంలో వచ్చింది)నీ తగ్గించగలిగితే నిత్యయవ్వనం సాధ్యమంటూ, అదేపని red wine కొంతవరకూ చేస్తుంది, కాబట్టే దాన్ని తరచుగా సేవించే ఫ్రెంచి వాళ్ళు "can love like French" అంటాడు. మొత్తానికి ఆ idiom కి ఒక కొత్త అర్ధం తెలిసింది :).

ఈ Nikolai Kardashev చెప్పిన Type-I, Type-II and Type-III నాగరికతలగురించి చదవాలనుకుంటే శ్రీనివాస చక్రవర్తిగారు రాస్తున్న శాస్త్ర విజ్ఞానము బ్లాగులో చదవండి. ఇంత చక్కటి వివరణ నాకు మరొకచోట దొరకలేదు. ఈ టపాలెంతగా నచ్చాయంటే అప్పట్లో వీటి లింకులను దాచుకున్నాను. లింకులు వరుసగా.
  1. కర్డషేవ్ ఊహించిన మానవ భవితవ్యం
  2. మన ప్రస్తుత స్థితి - 0 వ రకం నాగరికత
  3. 1 వ రకం నాగరికత
  4. మృతియే లేని 2 వ రకం నాగరికత
  5. ఇతర తారలకి తరలే 3వ రకం నాగరికత
డబ్బు వెచ్చించి కొనగలిగితే లో కొనండి. లేదంటే scribd.com లో ప్రయత్నించండి.

0 comments: