Saturday, August 27, 2011

నా ఇష్టం

ఈ పుస్తకం ఎంతగా నచ్చేసిందంటే ఆ. సౌమ్యగారు పంపించిన PDF చదివిన తరువాత కేవలం underlineచేసి, foot notes రాసి, నా లైబ్రరీలో దాచుకోడానికి ఈ పుస్తకం hard copy కొన్నాను. ఈ పుస్తకంలో నాకు పరిచయమైన రాము నాకు చాలా అందంగా, అమాయకంగా, ఎంతో స్పష్టత, పరిణతీ కలిగిన వ్యక్తిగా, ఒక తత్వవేత్తగా, జ్ఞానిగా కనిపించాడు. ఇంకా చెప్పలంటే Howard Roark లా కనిపించాడు. ఈయనకన్నా నాకు నచ్చిన క్యారెక్టర్ ఈయన స్నేహితుడు సత్యేంద్ర. ఓషో పుస్తకాన్ని చదువ్తున్నప్పుడు ఎంత తరచుగా పుస్తకంలోని విషయాన్ని అంగీకరించేసి నా ఆలోచనల్లో క్లారిటీ పొందుతానో, నాలో లీలామానుషంగా వున్న భావనలను ఇంకెవరో verbalize చేసిపెడితే యురేకా అని గెంతుతానో ఈ పుస్తకం చదువుతున్నప్పుడు ఆ అనుభవం అంత తరచుగానూ అంత గాఢంగానూ కలిగింది. రెండోసారి చదువుతున్నప్పుడు కూడా. నిజానికీ పుస్తకం చదువుతున్నంతసేపూ నేను  వేర్వేరు పుస్తకాలకీ, వ్యక్తులకీ కనెక్టవుతూనేవున్నాను.

"నాన్నను ఇప్పుడు సంతోషపెట్టి, తర్వాత బాధపెట్టాలా? లేక ఇప్పుడు సంతోషపెట్టి తరువాతపెట్టాలా?" అని అన్నప్పుడు ఆయన క్లారిటీ, రిస్కుతీసుకోగల ధైర్యం, దూరదృష్టీ వీటన్నిటికీ మించి తనమీద తనకుగల నమ్మకం, తాననుకున్నదాన్ని ప్రయత్నించి చూడ్డానికి ఎంతకైనా తెగించడం నాకు నచ్చేశాయి. ఇక్కడ కొంచె deviate అయేందుకు మీరు సిధ్ధంగా వుంటే ఇంకోటి చెబుతాను. "గోదావరి" సినిమాలో కధానాయకుడి పాత్ర ఒక తండ్రినుద్దేశించి ఒకమాటంటుంది "మాకు పాతికేళ్ళొచ్చాక్కూడా మేమేంచెయ్యాలో మీరుచెబితే ఇహ ఈ ప్రపంచం మారదు" అని. తల్లిదండ్రుల మాట వినాల్సిందే కానీ వాళ్ళుచెప్పినదానికన్నా మన logic గొప్పది అనుకున్నప్పుడు, మన తెలివితేటల స్థాయినీ వాళ్ళ అనుభవం విలువనీ బేరీజువేసుకొని మరీ ముందుకెళ్ళాలి. All's well that ends well అన్నదాన్ని మరచిపోకూడదు. చచ్చేటప్పుడు ఆలా చేసుంటే బాగుండేదేమో అన్న బాధ అవసరమా చెప్పండి?

ఇదే vedio parlour success  గురించి మాట్లాడుతూ నా ఫ్రెండ్స్ వల్ల, వాళ్ళ రాకపోకలవల్ల ఆదాయం పెరుగుతుందనుకున్నాను, కానీ వాళ్ళ వల్ల దమ్మిడీ ఆదాయం రాకపోగా వాళ్ళెప్పుడూ casettes rent ఇచ్చేవాళ్ళుకాదు 'cause they are friends అన్నప్పుడు Robert Green చెప్పిన A friend expects favours from you where as, an enemy does anything for you to prove himself worthy your company అన్నమాట గుర్తొచ్చింది. వీలైతే 48 Laws of Powerలోంచి Never Put Too Much Trust in Friends, Learn to Use Your Enemies అనే chapter చదవండి. చాలా బాగుంటుంది. 

"పుట్టినరోజు ఉత్సవాలు జరుపుకోవడానికి ప్రాధమిక కారణం... ప్రతి మనిషిలో దాగున్న అభద్రతా భావం. నేనెవ్వరికీ పట్టనేమో, నాకేమాత్రం ప్రాధన్యతలేదేమో అన్న దిగులులోంచి ఈ టైపు వేడుకలు పుడతాయి. ఎక్కువశాతం మంది జీవితంలో ఏమీ సాధిచరు. సాధిచలేమని కూడా వాళ్ళకి అర్ధమైపోతుంది. అందువల్ల కనీసం ఆ ఒక్కరోజైనా కొంతమంది ఆ వ్యక్తిని ప్రత్యేకంగా చూస్తే, తమకు తాము గ్రేట్‌స్టార్స్‌గా ఫీలయిపోతారు. ఇంక ఆ ఫీలింగ్ పునరావృతమయ్యేరోజుకోసం, వాళ్ళు మళ్ళీ 364 రోజులు ఆత్రంగా ఎదురుచూస్తారు" అన్నప్పుడు నాకున్ పిచ్చపిచ్చగా నచ్చేశాడు. ఒక సినిమా వుందండీ "హైద్రాబాద్ నవాబ్స్" అని... అందులో విలన్‌గారు తన పుట్టినరోజునాడేం చేస్తారో తెలుసా? ఒంటరిగా ఒక బర్రెనుతోలుకొనిపోయి అది మేస్తుంటే ఈయన చెట్టుకు చేరగిలబడి ఏదో గుర్తుకుతెచ్చుకుంటూవుంటాడు. నేనైతే నా B'Day నాడెవ్వరికీ అందుబాటులో వుండను. I hate to be wished. "పుట్టిన రోజు నాకు చావుని గుర్తుకుచేస్తుంది" అన్నప్పుడు చిన్నప్పుడు చదువుకున్న కొటేషన్ "పుట్టిన రోజు నీ తరిగిపోతున్న ఆయుష్షును గుర్తుచేస్తుంది. నీవనుకున్న పనులు పూర్తిచెయ్యడనికి కావలసిన సమయంలో ఒక సంవత్సరం తరిగిపోయిందన్న విషయాన్ని గుర్తుచేస్తుంది"  గుర్తొచ్చింది. చివరగా "ఫుట్టిన తరువాత ఏం చేశావన్న దాంట్లో సెలబ్రేషన్ వుండాలికానీ, పుట్టినందుకే సెలబ్రేట్ చేసుకొనే వాళ్ళు అత్యంత మహా చేతగానివాళ్లని నా నమ్మకం" అని ముగిస్తాడు. 

ఇంకో సందర్భంలో మనం చాలాపెద్దవి అనుకొనే విషయాలు ఇంకొకరి దృక్కోణంలోంచి ఎంతచిన్నవో చెబుతూ భారత్,పాక్‌లు కాశ్మీర్‌కోసం తగువులాడుకోవడాన్ని బళ్ళోపిల్లలు బలపంకోసం కొట్టుకోవడంతో పోలుస్తాడు. ఇదే విషయంలో మన అల్పమైన పరిధుల గురించీ మాట్లాడుతూ సిధ్ధార్ధ కాలేజ్ క్యాంపస్ పరిధినుంచి మొదలుపెట్టి పటమట లంక పోలీస్ స్టేషన్, విజయవాడ, ఆంధ్ర, ఇండియా, ప్రపంచం పరిధిలోకి మారిపోయి ఇప్పుడు ఈ కాలేజ్ గొడవ నిజంగా పెధ్ధదా లేక అల్పమైనదా అనడిగినప్పుడు నేనిచ్చిన ఇలాంటి ఉదాహరణొకటి గుర్తుకొచ్చింది. తనకోసం కత్తిపోటుకి గురైన మిత్రుణ్ణి ఇంతవరకూ కలవనైనా కలవలేదుగానీ, ఆ పొడిచిన వ్యక్తిని కౌగిలించుకొని ఆప్యాయంగా మాట్లాడాను అన్నప్పుడు నాకు Fine Balance - Rohin Mistry లో క్లైమాక్స్ గుర్తొచ్చింది. పాత్ర్లల పేర్లు గుర్తులేవుగానీ ఎంతో సన్నిహితంగా మెలిగిన ఆ నలుగురూ ఏవో సంఘటల వల్ల ఎఫెక్టవ్వడం అలా వుంచితే ఎదురుపడితే కనీసం గుర్తించడానికి కూడా నిరాకరించడం అప్పట్లో నన్ను depressionకి గురిచేసింది.

"శ్రీదేవి లాంటి అందగత్తెని తనలో వుంచుకొనే అర్హత మనిషి నిర్మించిన ఏ ఇంటికీ" లేదన్నప్పుడూ, "తనని పొందె అర్హత ఎవరికీ లేదని అన్నప్పుడూ" మాత్రం నా ఆలోచనలను, నా మాటల్నీ దొంగిలించి నా అనుమతిలేకుండా తన పుస్తకంలో వాడేసుకున్నందుకు కోపం వచ్చింది. అంత "అందం"వున్నవాళ్ళు నాకూ తారస పడ్డారు. ఏదో సాధించాలని తపనపడి చివరకి పెళ్ళిచేసుకొని they had ceased existing as them selves or simply they had "become dead". వాళ్ళ పెళ్ళి విషయంలో నాదీ సరిగ్గా ఇదే అభిప్రాయం. కొంత మందినైతే "why do you wanna die?" అనడిగేశాను. "ఇన్నాళ్ళూ కష్టపడి చదివిందీ, నీకంటూ ఒక ప్రత్యేకతను సాధించిందీ నిన్నునీలా గుర్తించలేని మొగుడు అనే ఒక అహంభావికి అర్పించి వంటింటికీ, పడకటింటికీ పరిమితమైపోవడానికా? ఈ మాత్రానికి ఆ చదువేదో చదవకుండా వుంటే ఇంకొకరు ఆ అవకాశాన్ని సద్వినియోగ పరచుకొనుండేవారు కదా!!" అనడిగినప్పుడు నా ఎదురుగాకూర్చొని నా కళ్ళలోకితొంగిచూసిన empty looks గుర్తొచ్చాయి ఈ భాగం చదువుతున్నప్పుడు. 

"రీప్రోగ్రామింగ్" అన్న topicలో ఈయన చెప్పినట్లే నేను కొంత మందిని అడిగాను. "Lets say you were born in that nation/religion/caste, wouldn't you be supporting and/or respecting that?" అని. సమాధానం సంగతలా వుంచి ప్రశ్నను అర్ధంచేసుకున్న వాడొక్కడూ కనబడలేదు నాకు. ఆఖరుకి నేనూ ఈయన ఈ విషయంలో ఇచ్చిన conclusionకే వచ్చాను. "People around us decide what opinions we are supposed to have. Most of the us follow them blindly and then find reasons supporting them. A clear case of letting the opinions settled in before any information is gathered." 

డబ్బు గురించి ఈయనన్న మాటలతోకూడా ఏకీభవిస్తాను. అనుభవించేస్వాతంత్ర్యం లేనప్పుడు(తరువాతి తరానికి pass on చెయ్యాలికదా) ఎన్నికోట్లున్నా అనవసరం. డబ్బుకున్న ప్రయోజనం సుఖాన్నీ, సౌకర్యాన్నీ కలిగించడం. అందుకు ఉపయోగపడని డబ్బు విలువ శూన్యం. నా కొలీగ్ ఒకాయన ఇలా అంటుండే వాడు "నీ బ్యాంకు accountలో పడున్న డబ్బు విలువ గుండుసున్నా. దాంట్లోంచి ఎంతమొత్తమైతే ఖర్చుపెడతావో అంతమేరకు విలువైన వస్తువు/సేవ నీకు సొంతమవుతుంది." ఆయనపేరు పండూరి శివ. ఎప్పుడైనా హైడీలో కలిస్తే మాట్లాడండి ఇలాంటివి చాలా చెబుతాడు. ఒకమ్మాయి మీదగ్గరకు వచ్చి నేను కోటిరూపాయలాస్థివున్న అబ్బాయిని/అమ్మాయిని పెళ్ళిచేసుకొని సుఖంగా స్థిరపడిపోవాలా? లేక ఉద్యోగం చేసుకుంటూ జీవితాన్ని సాగించాలా అంటే మీరెం సలహా ఇస్తారూ? నేనైతే కుక్కకాపలాకాసి తరువాతితరానికి అందించాల్సిన డబ్బుకన్నా life style ముఖ్యమనీ ఉద్యోగం చేసుకుంటూ నీ జీతాన్ని నీకోసం ఖర్చుపెట్టుకోగలిగే స్వాతంత్ర్యం ముఖ్యమనీ చెవుతాను. చెప్పాను. ఇప్పుడదే చేస్తున్నాను. ఈయనన్నట్లుగా ఆ తరువాత ఏదో తరంలోవాడు ఈ డబ్బంతా క్షణాల్లో ఖర్చుపెట్టేశాడనుకోండి... మనమూ, మన ముందుతరాలవాళ్ళు టోకుగా వెధవాయిలమైపోతాం. అయినా తరువాతితరానికందించాల్సింది ఆత్మాభిమానాన్నీ, శక్తి సామర్ధ్యాలనీ, విలువలనే కానీ "నువ్వేమీ చెయ్యకపోయినా ఫర్లేదుననే" ధైర్యాన్నికాదు. ఇది వదలనంతవరకూ స్కాములూ, కట్నాలకోసం వెధవ్వేషాలూ, జీవితాన్నే పణంగా పెట్టి డబ్బుసంపాదించడాలూ ఆగవు. దేశమూ బాగుపడదు. 

చివరగా సన్నాసుల గురించి ఒక మంచిమాటంటాడు. ఏపనీ చేయడానికి ధైర్యంచాలని పిరికి సన్నాసులు తీరా నువ్వుచేసిచూపిన తరువాత దాని success/failureకి కారణాలు వెదుకుతారు అంటాడు. ఉదాహరణగా గవాస్కర్ ఔటయ్యి పెవిలియన్‌కి వెళితేనంటా.. అక్కడుండే మోకలి ప్యాడ్స్‌తీసే అటెండర్‌కూడా "ఆ బంతిని ఆడకుండా వుండాల్సింది" అని సలహా ఇచ్చేవాడట. ఇది ఆఫీసుల్లో నిత్యం ఎదుర్కొనే సంఘటన కాదంటారా? మనకెలా చెయ్యాలో తెలినప్పుడు, చేసిచూపే తెగువ, సామర్ధ్యం లేనప్పుడు పక్కన పడుండాలి. అంతేకానీ చేస్తున్నవాడి పనిలో లోపాలువెదకకూడదు కదా. ఒక వేళ విజవంతమైతే అది తమ సలహాని పాటించడం వల్ల అనీ, ఓడిపోతే తమ సలహాని పాటించకపోవడం వల్లే అనీ రొదపెట్టే రొదపిట్టలను పట్టించుకోవద్దంటాడు. నాకైతే ఇది గుర్తొచ్చింది.
Every revolutionary area – in science, politics, art, or whatever – evokes three stages of reaction.
They may be summed up by the three phrases.
1) Its impossible- Don't waste my time.
2) Its possible, but it is not worth doing.
3) I said it was a good idea all along.
--Clarke's Law of revolutionary ideas.

చెప్పుకుంటూ పోతే చాలా వున్నాయండి. డబ్బెందుకు అన్నదాంట్లో.. "ఒక abstraction" అంటూ we pot our labour using money అన్నట్లు మాట్లాడతాడు. ఓపికున్నప్పుడు శ్రమనుచెసి దాన్ని డబ్బుగా మార్చి, దాచుకొని మన అవసరమైనప్పుడు ఆ డబ్బును (ఖర్చుబెట్టి కొనడంద్వారా) మళ్ళీ శ్రమగామార్చుకుంటాం అన్నట్లు అంటాడు.మనకు తెలిసిన శ్రమని డబ్బుగా మార్చుకొని మనకవసరమైనప్పుడు అదేడబ్బుని మనకవసరమైన ఇంకొక శ్రమగా మార్చుకుంటాం. అనగా ఈ డబ్బు అనేది an abstract form of labour. వావ్ ఎంత బాగుంది!! Money is that to labour, what a battery is to electric charge. ఎంతచక్కగా చెప్పాడు!! క్షణక్షణం అనే సినిమా ఈయన శ్రీదేవికి రాసిన ప్రేమలేఖట. అవునుకదా!! ఆల్రెడీ తాజ్‌ని ఇంకొకరు నిర్మించేశారు కదా...!! కాబట్టి ఈయన ఈ చిత్రాన్ని నిర్మించాడన్నమాట.

4 comments:

The Chanakya said...

నా అమితంగా అభిమానించే రాము 'నా ఇష్టం' గురించి ఇంత సవివరంగా రాసిన మొదటి విమర్శ ఇదేనేమో. బహుశా నేను చదవడం ఇదే మొదటిది. ఆ పుస్తకం వచ్చిననాటి నుంచి ప్రయత్నిస్తున్నా చదవడం కుదరడంలేదు. దానికి పెద్ద కారణాలు లేకపోయినా కుదరలేదు అంతే. కానీ పుస్తక సమీక్ష అంటే మీరు రాసినంత చక్కగా మరొకరు రాయలేరేమో అనిపిస్తుందండి. చాలా బాగుంది.

>>"Lets say you were born in that nation/religion/caste, wouldn't you be supporting and/or respecting that?"<<

ఇదే ప్రశ్న ఒకానొక సందర్భంలో నా బ్లాగ్‌లో ఒకరిని అడిగాను. మీరన్నట్టు జవాబు సంగతి దేవుడెరుగు, ముందు వాళ్లకి ప్రశ్నే అర్థం కాలేదు. పైగా నీ వాదనలు వింతగా ఉన్నాయి, నీకేమన్నా తిక్కా అన్నట్టు నన్నే తిరిగి ప్రశ్నించారు.

Indian Minerva said...

సమీక్షలు రాసెంత ప్రతిభ ఇంకానాలో కలగలేదండీ. మీ ప్రశంసకు నేను ఏమాత్రమూ సరిపోను. భవిష్యత్తులో ఆ ష్తాయికి చేరుకోవడనికి తప్పకుండా కృషిచేస్తాను.

మీరు అభిమానికూడా అన్నారుకాబట్టి ఈపుస్తకం మీకు ఒక బైబిల్. తప్పకుండా చదివెయ్యండి. రామూజీ సినిమాలు నాకంతగా నచ్చవుగానీ నేను నాకోసమే జీవిస్తాను, ఇంకొకణ్ణింప్రెస్ చెయ్యాల్సిన అవసరం నాకులేదు అనే మనస్తత్వం నాకు బాగా నచ్చుతుంది. వీడు మొండివాడికన్నా బలవంతుడు.

కొత్తావకాయ said...

Howard Roark తో పోల్చి మరీ చెప్తూంటే చదవక చస్తానా? చదివి తీరుతాను. సమీక్ష అనను దీన్ని. మంచి పుస్తకం చదివాక కళ్ళలో నిజాయితీగా ప్రతిబింబించే సంబరంలా ఉంది టపా. అభినందనలు.

Indian Minerva said...

మీరన్నది నిజమేనండి. ఇది సంబరమే. నేను ఒంటరినికాదు అనిపించింది ఈ పుస్తకం చదువుతుంటే. ఈయనగారి సినిమాలమాటెలావున్నా he deserves to have me as a fan :D.