ప్రవక్త మహమ్మద్‌ని ఇంత బాగా defend చేసిన పుస్తకాన్ని ఈ మధ్యకాలంలో చూడలేదు. మొత్తానికి ఈయన గురించి మనకు తెలిసిందంతా Martyrs of Cordoba స్ఫూర్తిని సంతరించుకొని పశ్చిమదేశాల తత్వవేత్తల అపోహలు, కొండొకచో అపార్ధాల సమాహారమేనంటుంది. "ఆ మాత్రపు అసంబధ్ధతలు, అసహ్యాలూ బైబిల్‌లో కూడా వున్నాయి కళ్ళుపెట్టుకొని నిష్పాక్షికంగా చూడగలితే" అనే ఈవిడ తన తొలినాళ్లలో ఒక నన్‌కావడం ఈవిడ వాదనకు సాధికారత చేకూర్చే విషయం. క్రీస్తునీ, మహమ్మద్‌నీ వారివరి చారిత్రక నేపధ్యాల ఆధారంగా పరిశిలించి ఏది జీసస్‌కి అనూహ్యమో అనవసరమో అది మహమ్మద్‌కి అత్యవసరము అని చెప్పడంలో విజయం సాధించింది (నా వరకు). నాకెప్పటికీ మింగుడు పడని ఈ divine inspiration ని మినహాయిస్తే, ఒక సైనికాధికారిగా మాత్రమే(ప్రవక్తగా కాకుండా) చూస్తే నాకైతే మహమ్మద్‌లో చెప్పుకోదగ్గ లోపాలేం కనపడలేదు.
ఈ పుస్తకం చదవడంవల్ల నాకు తెలిసిన కొత్తవిషయాలు లేదా కలిగిన సందేహాలు ఇలా వున్నాయి:
- ఇన్నాళ్ళూ al-Lah అన్నపదానికి అసలు స్త్రీలింగమే లేదనుకున్నాను. కానీ al-Lat అనే దేవత ఒకావిడుందట. ఇక al-Lah అనే దేవుడొకాయన వుండగా ఆయనకు ముగ్గురు కూతుళ్ళుకూడా(binat al-Lah) వుండేవారట. అరబ్బుల పాగనిజంలో వీళ్లందరూ దేవతలేనట. మహమ్మద్ తనజీవితంలో ప్రత్నించింది తెగల పేరున తన్నుకుచచ్చే అరబ్బులను ఈ al-Lah పేరున ఒక తాటిపై నిలిపి ఉంచడమేనట.
- "Monotheism is a product of civilization" అన్నమాట నాకెంతమాత్రమూ అర్ధంకాలేదు. ఈవిడే తన History of God పుస్తకంలో ఏవిధంగా వివిధ సమాజాల్లోని ప్రజలు ఒక దేవుడు మరీ 'అందకుండాపోతున్నాడ'ని భావించి వేర్వేరు (specialized)దేవతలను పూజించడం మొదలుపెట్టారో వివరిస్తుంది (తొలి అధ్యాయాల్లో).
- జీసస్‌పని కేవలం సామాజిక సంస్కరణ మాత్రమే కానీ మహమద్‌కి రాజకీయ సంస్కరణ అనేది తప్పనిసరయినది అదే లేకుంటే అసలు అరబ్బుల ఐక్యతే సాధ్యమయ్యుండేది కాదు.
- ఇస్లాంలోనూ, క్రైస్తవంలోనూ Satan అన్న కాన్సెప్టు పూర్తిగా ఒకదానికొకటి విరుధ్ధమట. క్రైస్తవంలో ఈ Satan మనిషిపతనానికీ, స్వర్గంనుండి గెంటివేతకూ కారణమైతే ఇస్లాంలో దేవుడుకి తప్ప మరొకరికి(ఇక్కడ ఆడం) తలవంచడానికి ఏమాత్రమూ ఒప్పుకోవడానికి ఇష్టపడక గెంటివేతకు గురైన దేవదూత అట. మొత్తనికి Satan అంటే material needs కి ఆకర్షితమయ్యే ప్రాణి అని అర్ధం అట. అమెరికా పట్ల అయతొల్లా ఖొమైనీ నిందాపూర్వక ప్రస్తావన "షైతాన్-ఎ-బుజుర్గ్" ని ఆవిధంగానె అర్ధంచేసుకోవాలట.
- ఏవిధంగా జీసస్ తను బోధిస్తున్న మార్గం కేవలం ఇజ్రాయెలైట్స్‌కి మాత్ర్రమే అని అభిప్రాయపడ్డాడో అదేవిధంగా మహమ్మద్‌కూడా తన మార్గం అరబ్బులకు మాత్రమే అని అభిప్రాయపడ్డాడట.
- ఇస్లాంని అర్ధం చేసుకోవడం క్రైస్తవులకన్నా యూదులకే తేలిక. In fact ఈ రెండూ ఒకదానికొకటి దగ్గరి మతాలు.
- తొలినాళ్లలో ముస్లిములు జెరూసలం వైపుతిరిగి తమ ప్రార్ధనలను సమర్పించేవారట. మక్కాను తొలిసారి కిబ్లాగా ప్రతిపాదించింది Al-Bara ibn Ma'rar అనే ఖస్రాజ్ తెగ నాయకుడట. తరువాత మహమ్మద్ అనుమతి లభించడంతో అదే కిబ్లాగా చలామణి అవుతూ వచ్చిందట.
- జిహాద్ అంటే కేవలం physical, moral, spiritual and intellectual effort అంటూ... అంతగా సాయుధపోరాటాన్నే ఉద్దేశించాలనుకుంటే ఏ "హర్బ్"అనో, "సిరా"అనో, "మారక"అనో చెప్పుండేవారు అంటుంది. మరి ఈ 'దార్-ఉల్-హర్బ్' అనేది ఎవరి క్రియేషనో అర్ధం కాలేదు.
- ఈ నాలుగు పెళ్ళిళ్ళ దగ్గరికొస్తే... ఆ నియమం ఉద్దేశ్యం వేరట. అప్పటి అరేబియాలో మగాళ్ళు ఎంతమందినైనా పెళ్ళిచేసుకోవచ్చట. 'బద్ర్' దగ్గర జరిగిన యుధ్ధంలో చాలమంది వితంతువులూ, అనాధలూ ఐతే వారిని ఆదుకోవడానికి వేరే దారిలేక ఆనాటి సాంఘీక పరిస్థితులను దృష్టిలో వుంచుకొని అలా చెప్పవలసి వచ్చిందట. అప్పటికీ అది ఆ నలుగురుకి పరిమితి విధించడమేకానీ విచ్చలవిడితనానికి ఆమోదముద్రవెయ్యడం కాదట.
- పంతొమ్మిదో శతాబ్దపు చివరి నాళ్లవరకూ కూడా equal status for women కోసం పోరాడుతూ వున్నామన్న విషయాన్ని దృస్టిలోపెట్టుకొని మహిళలవిషయంలో ఏడవశతాబ్దిలోనే మహమ్మద్ బోధించిన ఆస్థుల పంపకపు నియమాలనూ,మహిళలకు సాక్షులుగా అంగీకారయోగ్యతను కట్టబెట్టడాన్నీ మరోమారు అర్ధంచేసుకోప్రయత్నించమంటుంది.
- మహమ్మద్ జైనబ్‌ని పెళ్ళాడటాన్ని సమర్ధించడం మాత్రం నాకేమాత్రం అర్ధం కాలేదు. "తన ప్రియభక్తునికెప్పుడు అవసరమొచ్చినా అల్లా ఒక వెసులుబాటు కల్పిస్తాడులే" అని అయేషా దెప్పిపొడిచిన ఘట్టం మాత్రం నవ్వుతెప్పించింది.
- అయేషా, ఆవిడ ధైర్యమూ, తన సౌశీల్యతను నిరూపించుకోవలసిన సమయంలో తను ప్రవర్తించిన విధానమూ నచ్చేశాయి.
- మతమార్పిడుల విషయంలోకొస్తే మహమ్మద్ అరబ్బులందరూ ఒక తాటిపై నిలవడానికి ఒక divine inspiration అవసరమని నమ్మి తెగలన్నింటికీ అతీతంగా ఒక సమాజాన్ని స్థాపించడానికి రక్తపాతం అవసరమని నమ్మాడేగానీ ఆయన వుద్దేశ్యం యూదులను మతం మార్చడమో (తన లక్ష్యానికి ఆటంకం కానంతవరకూ) లేక ఇంకోటో కాదట. In fact 700 సం|| చుట్టుప్రక్కల ఈ మతమార్పిళ్ళకు వ్యతిరేకంగా ఒక చట్టమే వుందట. ప్రస్తుతం మనంచూస్తున్నదంతా Arab capitalism ప్రభావాలు అంటుందీవిడ.

16 comments:
hm interesting...should read this book then!
>>"Monotheism is a product of civilization"<<
ఈ మాట మీకు అర్థం కాలేదన్నారు. నాకెందుకో ఆ మాట అంత సంక్లిష్టంగా అనిపించడం లేదు. బహుశా 'నాగరికత(civilization)' అనే పదాన్ని మీరు లౌకికమైన భావనలో తీసుకున్నారేమో. అది ఆధ్యాత్మికంగా నాగరికులు కావడం అని ఆవిడ ఉద్దేశ్యం కావచ్చు. ఏమో నా ఆలోచన తప్పయి ఉండవచ్చు కూడా.
>>ఇస్లాంని అర్ధం చేసుకోవడం క్రైస్తవులకన్నా యూదులకే తేలిక.<<
ఇది మాత్రం అక్షరాలా వాస్తవం. ఎందుకంటే ఒకరకంగా ఇస్లాం, క్రైస్తవం రెండిటికీ మూలాలు యూదుమతంలోనే ఉన్నప్పటికీ, క్రైస్తవ మతం కాలానుగుణంగా చాలా మార్పులకి లోనయ్యింది. నిజానికి ఈ రోజు మన చూస్తున్న Christianity దాని మూలాల నుంచి పూర్తిగా వేరుపడిపోయింది. కానీ ఇస్లాం, యూదు మతాలు ఆ స్థాయిలో మార్పులకి లోనవ్వలేదు.
Anyway, interesting and educating post. Thanks for introducing us this book. : ))
@ఆ.సౌమ్య గారు: Thank you
@The Chanakya గారు: ఆవిడన్నది theosophical evolution లో ఈ monotheism అనేది చివరిమెట్టు అనే అర్ధంలోనండీ. ఈ సోకాల్డు montheismలో వుండే 'jealous God' ప్రస్తుతం సాగుతున్న proselytizing మొత్తానికీ కారణమని నా అభిప్రాయం. ఇతరేతర సంస్కృతులతో సహజీవనాన్ని ప్రోత్సహించని ఇది సివిలిజేషనుకే గీటురాయి అంటే రెండు క్వశ్చనుమార్కులు గుచ్చుకున్నాయి. Thank you
మీరు వివరంగా చెప్పాక నాకు మూడు క్వశ్చన్‌మార్కులు గుచ్చుకున్నాయి. ; )
హ్హ్మ్.. నాకు అర్ధమయ్యే పుస్తకం కాదేమో ఇది
There are many websites and books which are critical about Islam. But you will find some exclusive scholarly treatment of the subject from Ali Sina and others at www.faithfreedom.org. Also Robert Spencer, Wafa Sultan are a few of the many decent and highly acclaimed critics of Islam. Most of all Quran, Hadiths, Sira, and Sunnah are the primary and quite authentic sources which are very critical about Islam with their clear and numerous contradictions!
Religions when created by men were appropriate to the times they were created. They have to change with the changing times. The problem with Islam is that it does not try to become contemporary. It is too rigid. Muhammad was more of warrior than a religious leader. His main aim was to unite the Arab tribes, which he succeeded in. Judaism is also a very rigid religion.
@రిషి గారు: మొదటి అధ్యాయాన్ని దాటివెళ్ళగలిగితే మిగతాది ఫరవాలేదండీ.
@Carpenter's Son గారు: ఈ faithfreedom.org seems to be a site dedicated to spread the word against. While reading critique is important and is required, one may not form an opinion solely based on that. I believe that one should go through the complete material at ones disposal to get a complete picture. However hated is as of now, I believe Islam too is good is some aspects.
@kosuru గారు: I agree with you. I think every religion has its share of fanatics and the fact the Islamic fanaticism is popular has to with with the majority of the Islamic states when compared to secular sates in Islamic region. Another problem with Islam seems to be the states embracing non-progressive ideologies like Wahabism. Muhammad looks efficient when considered an admiral but I've got problems with his prophet-hood (when I consider the literary meaning of prophet). All the prophets are actually deified figures anyway.
whatever good that you find in Islam/quran was the "sweet talk" of muhammad when muslims were a mere minority at mecca. to appease the meccans he spoke a few words of tolerence. no doubt, islam is a fascist, totalitarian, imperial concept- their own writings confirm it.
>>faithfreedom.org seems to be a site dedicated to spread the word against.
coming to faithfreedom.org, it is a site run by ex-muslims, who are well educated unlike the mullahs. i don't think it is a site dedicated for bad propaganda. as you said, one should go through the complete material at ones disposal..... why not one should examine the resources and quotes cited by faithfreedom.org and refute if there is any bias or hatred.
>>I believe that one should go through the complete material at ones disposal to get a complete picture.
once you read quran, hadiths and sira from even the trusted translations of muslims, you can understand the gravity of the problem islam holds for the entire mankind.
>>However hated is as of now, I believe Islam too is good is some aspects.
islam seeks complete annihilation of kafirs, which is quite sickening.
the irony is, it has become a crime and hate speech to speak about islam PLAINLY from its own books- the quran, hadiths, sira!
Best example is the trial of Geert Wilders for his short film "Fitna"!
While Muhammad is a historical figure and much is known about the person, same can not be said about Jesus. Jesus as portrayed in Bible might not have existed at all. There are as yet no conclusive proofs to the fact. This most theologists agree, I think. The gospels were written more than 100 years after Jesus was crucified and that too in Greek and not in the language of the region. Similarly we do not know much about the apostles other than their names and the gospel clearly mention that they were not written bu John, or Luke or Mathew etc., but are according to them only.
By the way after reading the review I bought the book and read it. It appears to be written with a very sympathetic view by a person who was disenchanted with christianity. It is also having comments twisted against Hinduism and India.
@kosuru గారు: జీసస్ నిజంగానే జీవించివుండవచ్చు కాకపోతే ఆయనకు దైవత్వం మాత్రం చర్చివాళ్ళు ఆపాదించారు(దేవుడితో ఎటువంటి సంబంధాన్నీ తనకుతాను ఆపాదించుకోలేదట). ఇక ఈ apostles అంటారా... The God Dellusion అన్నపుస్తకంలో Mathew మరియు ఇంకొకాయన accounts of genealogy ని తీసుకొని ఏవిధంగా వీళ్ళిద్దరివీ ఒకదానికొకటి సరిపోవో చెబుతాడు (ఇద్దరూ ఒకేవ్యక్తి దగ్గర మొదలుబెట్టి జీసస్‌ని trace చేసుకొస్తారు. ఒకాయనేమో 22 తరాలు లెక్కిస్తే ఇంకొకాయన లెక్క వేరేగా ఉంటుంది). Anyhow, apostles యొక్క ఉద్దేశాలు వేరు కాబట్టి వాళ్లని "ప్రభావితం" చేసింది ఆనాటి రోమన్ పాలకులంటారు కాబట్టి క్రొత్తనిబంధననుకూడా యధాతధంగా అంగీకరించలేము. నావరకు జీసస్ ఒక సంస్కర్త అంతే దేవుడుకాదు అయినా నాగౌరవాన్నందుకోడానికి అదిచాలు.
మీరన్నది నాక్కూడా అనిపించింది. ఇప్పుడు Why am I Not a Muslim రాసినాయన్నీ(Ibn Waraq) ఈవిణ్ణీ ఇద్దర్నీ చర్చకు కూర్చోబెడితే బావుంటుందనికూడా అనిపించింది. నాకైతే Why am I Not a Muslim కీ ఈ పుస్తకానికీ పోలికలు(వైరుధ్యాలు??) నవ్వుతెప్పించాయి. ఈ twisted-against-Hinduism-and-India మాత్రం నేను అంతగా పట్టించుకోనుండను. అందుకేదానిగురించి నేను ప్రస్తావించనైనా ప్రస్తావించలేదు.
Christianity as such has outgrown its earlier imperial and cruel practices and now limits itself to subtle spread of the word. It did not have the status of religion until about 300 AD when it was accepted by Roman emperors as a religious practice. Early popes did not restrict themselves to churches but led armies. The cruelties inflicted on natives of America are well documented.
On the other hand Islam does not believe in other religions. It accepts the judaism and christianity as faiths that can be condoned and can be tolerated and their followers need not be forcefully converted. It does not give this leeway to the pagan religious practices. Moreover, the Muslims are not expected to be under someone else's rule but are expected to impose themselves on other faiths. This has brought insecurity between the politics and religion. If one restricts oneself to religion on a personal level, there is no problem, but when these overstep on other realms problems arise. Christianity to some extent evolved itself while Islam could not and stopped the evolution some 600 years ago. It has now a source of extensive economic power in the fossil fuel wealth. Had it not been for this I feel the militant Islam would have fount itself restricted. On the other hand I shudder at the thought what would have happened if this fuel power rested in the hand of profligate west. I do not know how much you would agree with my views.
Recently, I started reading about different religions and found that Jesus is as much a mythical figure as Hindu gods. I remove Buddha and Mahavir Jain as they are as much real as you and me. Hindu religion has attributed Godliness to Buddha and made him an avatar of Vishnu.
guys...ONE SUGGESTION...
please tell me if u have to learn a cake will u go to a mechanic??? oviusly not, so if u wanna know about islam go to a muslim dont depend on others written books..... FORGET THE RELIGION BE A HUMAN FIRST...HUMANITY = RELIGION....
@raafsun గారు: మీ వ్యాఖ్యను ఇప్పుడే చూశాను. మీరన్నది ముమ్మాటికీ నిజం. మతాలు/ప్రవక్తలు తమకు తెలిసిన లోకమే ప్రపంచమని నమ్మారు and they did their best to ameliorate. "మానవసేవే మాధవసేవ" దీనితో విభేదించిన ఏమతమైనా దానిపై నాకు గౌరవం వుండబోదు. ధన్యవాదములు.
Post a Comment