ఈ మధ్య నేను చదివిన/చూసిన పుస్తకాలలో/సినిమాల్లో ఇది చాలా బాగా నచ్చింది. సరిగ్గా గమనిస్తే ఇదో వ్యక్తిత్వ వికాస పుస్తకం. కానీ నీతులతో జనాల్ని ఓ... బాదెయ్యకుండా చెప్పాలనుకున్నదాన్ని ఒక కధలా చెప్పడం చాలా బాగుంది. దీన్నే గోల్కొండ హై స్కూల్ పేరుతో సినిమా తీసారు నాకు అదీ నచ్చిందీ, దాని కన్నా పుస్తకం మరెంతగానో నచ్చింది. Dumbo నాకీ పుస్తకాన్నిచ్చి 'చదవరా బాబూ' అంటే... నేను ఆ అసలు పుస్తకాన్ని జాతీయం చేసి. మరో రెండు కాపీలుకొని ఒకటి తనకీ రెండోది కొలీగ్ సచికీ ఇచ్చాను :) . మా T.L ఏమో నువ్వు చెడిందిగాక ఈ పుస్తకాలతో వీడ్ని చెడగొడుతున్నావు అని నన్ను ఆడిపోసుకుంటున్నాడు :(. యధాప్రకారంగా ప్రస్తుతానికి నా పిచ్చిపిచ్చి గీతలతో పుస్తకంలోని పేజీలు క్రికెట్‌పిచ్చి కన్నా దారుణంగా తయారయ్యాయి :).
అప్పటికే సినిమాని చూసివుండటం వల్ల మొదటి కొన్ని chapters మక్కీకి మక్కీకి వున్నట్లుగా అనిపించాయి. కధ చాలా పాతది కొంచెం 'లగాన్', కొంచెం 'చక్ దే' కలిపితే ప్రధాన కధ తయ్యార్. నేనయితే ఇలా చెబుతాను. GHS పోరగాళ్ళుంటారూ.... వాళ్ళు తెలుగు సినిమాల్లో హీరోల్లాగా బాగా aimless గా వుంటారు. స్కూల్ "ప్రిన్సి" వాళ్ళకి కొత్త క్రికెట్ కోచ్ ని appoint చేస్తాడు. ఆయనేమో ఈ మొద్దులను మెరికల్లా తయారుచేసి గత పదిహేనేళ్ళ చరిత్రను తిరగరాసి వీళ్ళని inter school cricket championship లో విజేతలుగా నిలబెడతాడు. అదెలాగూ ఊహించిందే కాకపోతే ఆ విద్యార్ధులను తీర్చిదిద్దే విధానం వుంది చూశారూ... అది సింప్లీ సూపర్బ్. కధలో నాకు నచ్చిన అంశాలు చాలా వున్నాయి వాటిలో కొన్ని... పిల్లలూ పంతులూ అన్న భేదాలు లేకుండా అందరూ కలిసి శ్రమించడం (కధలో చాలా సార్లు పిల్లలే చాలా విషయాలు నేర్పిస్తుంటారు. వాళ్ళని చూసి తన జీవితాన్ని సరిదిద్దుకుంటాడు సంపత్ - క్రికెట్ కోచ్. ఎన్నో సార్లు thanks to these kids అంటాడు), ప్రతిఒక్కరినుంచీ పాఠాలు నేర్చుకోవడం (ప్రతిదాన్నీ క్రికెట్‌కి relate చేస్తుంటారు అలాగే క్రికెట్ని ప్రతిదానితోటీ relate చేస్తుంటారు. అటెండర్, డ్రైవర్, మిగతా లెక్చరర్స్ అందరినుండీ వీళ్ళు తమ attitude ని మలుచుకుంటారు), విజయం అందరి కల అని ఒప్పించి 'ఇహ మీ కలకోసం మీరెలా కష్టపడతారో మీ ఇష్టం' అని వాళ్ళనుంచే inputs తీసుకోవడం, planning గురించీ improvement గురించీ పిల్లలు పడే తపన (నిజానికి ఇలాంటిది software companies లో ప్రతి team లో జరగాలి. అసలు మనమెందుకు team లో ఇలా వుండము అనిపించింది ఇది చదివాక), కెప్టెన్ గౌతం పాత్ర (చాలా balanced గా వుంటూ తన team గురించిన పూర్తి అవగాహనతో ఎవర్ని ఎప్పుడు దేనికి వినియోగించాలి అని తెలిసి ప్రవర్తిస్తుంటాడు. ఒక ideal team lead). నచ్చనిదొకటే opposite team ని శత్రువర్గంగా చిత్రీకరిస్తూ వాళ్ళను debase చెయ్యడం, వాళ్ళను villains గా చిత్రించడం. గెలవడానికీ, గెలుపులోని ఆనందాన్ని అనుభవించడానికీ కావల్సింది ఒక స్ఫూర్తి, పరిశ్రమ, ఒక సమవుజ్జీ. ప్రత్యర్ధులను ప్రత్యార్ధులుగా చూస్తే సరిపోతుంది కదా శత్రువులుగా ఎందుకు చూడాలి?
సినిమాకొస్తే... హీరో పాత్రను ఎలివేట్ చెయ్యడానికి కొంచెం ఎక్కువగానే మార్పులు చేసి, సినిమాలో వుండవలసిన కోపాలు, ప్రేమలు, క్షమించడాలు, అసూయలు కొచెం లైట్ గా దట్టించారు. విలన్ పాత్ర్లతో సహా అందరూ చాలా fresh గా నటించారు. అసలైతే సుమంత్ నాకు ఈ సినిమాలో నచ్చాడు. మొదట్లో ఒక డైలాగ్ చెబుతాడుకదా "ఇప్పుడీడు ఇన్‌స్వింగ్ యార్కరెల్లా వెయ్యలో చూపిస్తాడూ..." అని ఎన్ని సార్లు చూశాలో ఆ డైలాగ్‌ని. కిరీటి గా సుబ్బరాజు గానీ vice principal గా షఫి గానీ చాలా చాలా బాగా చేశారు. అసలుకైతే సుమంత్ కనా సుబ్బరాజు డైలాగ్ డెలివరీ తీరు సూపర్ అంత కూల్ గా విలనీ ని పండించడం ఆయనకే చెల్లింది. Body-line bowling తో తలకు దెబ్బతగిలినాక హెల్మెట్‌ని కూడా ఇచ్చేసి మైకీ reckless గా వికెట్లమధ్య నుంచుంటాడు కదా Bugs Bunny స్టైల్లో పిచ్చ పిచ్చగా నచ్చేశాడు. చివర్లో సిధ్ధాంత్‌ని బ్యాట్‌తో చూసి గౌతం నవ్వుతాడుచూడండి ఏదో సముద్రంలోంచి పైకొస్తున్న సూర్యుళ్ళా మెల్లిగా, క్రమానుగతంగా... దాన్నే నేను analog-నవ్వు అంటాను. స్వాతి చాలా క్యూట్‌గా వుంది. కళ్ళతోటీ, వాయిస్‌తోటీ చాలా మేజిక్‌చేస్తుందీ అమ్మాయి. " క్వాడ్రాంగిల్..., ప్రిన్సిపాల్..." ఇది కూడా చాలా సార్లు చూశాను. కాకపోతే ఈవిడ కోచ్‌గారితో firlt చేస్తూ చెప్పే డైలగ్స్ మాత్రం అన్నీ platitudes. అన్నీ too direct గా వుండి చిరాకొచ్చింది. ఈ పాత్రే అనవసరమనుకుంటే మళ్ళీ అందులో రొడ్డకొట్టుడు వేషాలు huh.... చివరికి పిల్లలు గెలిచాక వాళ్ళు అమ్మాయిల్లో popular అయ్యారు అనిచూపించడం ఒక భావదారిద్ర్యం(భావదారిద్ర్యాన్ని English లో ఏమంటారు? నేను కామెడీగా వుంటుందని aesthetic penury అని వాడుతుంటాను అదోలా pronounce చేస్తూ :D).
Manager కావాలనుకొనే ప్రతి ఒక్క సాఫ్ట్‌వేరుడూ చదవాల్సిన పుస్తకం. లీడర్ ఎలావుండాలి అనేది తెలుస్తుంది ఇది చదివితే.

2 comments:
Last 2 lines nacchaayi... aa buk chadivaaka naadi kooda same feeling..
సీత గారు: ఆది నా అభిప్రాయం కాదేమో. పుస్తకాన్ని నాకిచ్చినవాళ్ళు ఇది అలాంటిది అని చెప్పడంతో నేనూ eventual గా అదే అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నాను. In otherwords, I'm merely being a copy cat :D.
Post a Comment