Sam Parnia అనే డాక్టరు గారికి సరిగ్గా ఇదే సందేహం వచ్చింది. ఇంకేముంది పరిశోధించడం మొదలుపెట్టారు. ఆ పరిశోధనంతా ఒక పుస్తక రూపందాల్చింది. ఇది ఆ పుస్తకమే. పేరు... What Happens When we Die.
ఈయన అనుకోకుండా దగ్గరనుంచి గమనించిన మరణం ఈయనలో ఏన్నో ప్రశ్నలు రేకెత్తిస్తుంది. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు కనుగొనే ప్రయత్నంలో చేసిన పరిశోధనలసారమే ఈ పుస్తకం. సాధారణంగా గుండెకొట్టుకోవడం ఆగిపోయిన 11 సెకండ్లకి ఆక్సిజన్ అందక మెదడులో కణాలు అల్లాడిపోవటంమొదలు పెడతాయట. అవి Epinephrine లాంటి హార్మోనులను స్రవించి రక్తనాళాలను కుచించుకుపోయేలా చేసి రక్తపీఢనాన్ని అదుపులోవుంచేందుకు ప్రయత్నిస్తూ తద్వారా రక్త సరఫరాని సాధారణస్థాయికి తేవడానికి ప్రయత్నిస్తాయట(కనీసం మెదడు చుట్టుపక్కలా ప్రాంతాల్లో. రక్తనాళాలు చిన్నవయిపోయాయి కాబట్టి రక్తం తప్పనిసరై పైకితంతుంది ఆవిధంగా పీడనం నెలకొల్పబడుతుంది అనేది లాజిక్కట). ఏదేమైతేనేం ఇవాన్నీ కలిపినా కూడా 15 నిమిషాల తరువాత మెదడుకణాలు ఒక్కొక్కటిగా చచ్చిపోవడం మొదలుపెట్టడం వల్ల మెదడు తిరిగి కోలుకోలేని విధంగా దెబ్బతింటుందట. డాక్టర్లు సీ.పీ.ఆర్. లూ అవీ చేసినా అది 30 నిమిషాలలోనేనట అప్పుడుకూడా ఎంతోకొంత brain damage తప్పదట.
ఇక ఈయన పరిశోధన దగ్గరికొస్తే ఈయన పేషెంట్లలో దాదాపు 20 శాతమ్మంది అరగంటకన్న ఎక్కువకాలంపాటే ఇలా అచేతనావస్థలో వుండిపోయినా ఎలాంటి బ్రెయిను డామేజీలు లేకుండా బ్రతికి బట్టకట్టాగలిగారట. పైగా తాము జరుగుతున్నదంతా పైనుండి చూస్తూనే వున్నామని brain clinical గా ఆగిపోయినాకూడా ఏ విషయమూ మర్చిపోకుండా జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పగలిగారట. అలా చెప్పినవారందరూ దాదాపు ఒకేవిధమైన అనుభూతికి గురైనట్లు చెప్పుకొచ్చారట. అవి
- వెలుతురుతో నిండిన ఒక సొరంగాన్ని చూడటం (కొందరైతే అందులోంచి ప్రయాణంచేశామని కూడా చెప్పారట)
- ఒక దివ్యమైన కాంతిని చూడటం (వారి వారి నమ్మకాల నేపధ్యం పై ఆధారపడి అ వెలుగును తమ తమ దేవుళ్ళూ/దేవతలుగా అభిప్రాయపడ్డారట).
- చనిపోయిన తమ బంధువులను చూడగలగటం
- తమ జీవితంలో జరిగిన విషయాలన్న్నింటినీ ఒక సినిమాలాచూసి ఏదిమంచో ఏదిచెడో నిర్ణయించగలగడం బాధపడగలగటం (brain భౌతిక దేహంలోనే వున్నా)
- గాలిలోతేలుతూ తమభౌతికదేహాన్ని చూడగలగటం.
తమ తమ మత విశ్వాసాలను బట్టి ఇందులో కొన్ని చిన్నచిన్న తేడాలున్నా దాదాపు అందరు చెప్పిందీ ఇదేనట. కాగా ఇలాంటి విశ్వాసాల ప్రభావం అంతగావుండటానికి వీలుపడని చిన్నపిల్లలు(అతిచిన్న పిల్లవాడి వయసు 3 సంవత్సరాలట), నాస్థికులు కూడా ఇలాంటి అభిప్రాయాల్నే వెలువరించారట. ఈయన ఈ విషయాన్ని రూఢి పరచుకోడానికి స్వయంగా చేసిన పరిశోధనలు అంత సంతృప్తికరమైన ఫలితాలనివ్వకపోయినా ఈ సో కాల్డు Near Death Experiance లేదా NDEలు అనుభవిమంచి నేడు జీవిస్తున్నవారు పంచుకున్నవారి అనుభవాల ఆధారంగా కొన్ని ఆసక్తికరమిన విషయాలు, తాను చేసిన మరికొన్ని ఆసక్తికరమైన పరిశోధనలు వివరించారు.
ఇలా NDE కి గురయిన వాళ్ళలో తరువాత్తరువాత జీవితం గురించిన, మరణం గురించిన దృక్పధాలను గణనీయమైన మార్పులొచ్చాయట. చాలామది తరువాత చాల మంచివాళ్ళుగా గడిపారట. కొందరేమో అస్థికులుగా మారిపోతే మరికొందరేమో సేవా కార్యక్రమాలు నిర్వహించారట.
ఇదంతా చదివాక నాలో ఓ పేధ్ధ philosophical question ఉదయించింది అదేంటంటే "నేను" అంటే ఏమిటి లేదూ... ఇంకోలా What is "I"?

9 comments:
me tapaalo chala information undi mastaru, thank you for a good post.
Nice one !
Who Am I ??? to know this read Ramana Maharshi Literature.
Thanks to all.
@Raj Karsewak: No I mean what does "I" refers to hence "What is I?". Thanks for the suggestion but the problem with the Maharshis or Swamis is... I can comprehend them in no language. I tend to doze off after a couple of pages.
ఎనిమిదో తరగతిలో అనుకుంటా పబ్లిక్ లైబ్రరీలో Death and After అనే పుస్తకం కనపడితే నచ్చేసి ఇంటికి తెచ్చుకొని చదవడం మొదలుపెట్టా. అది చదువుతుంటే ఇంట్లోవాళ్లు అదోటైపు లుక్కిచ్చారు. చివరకు అందులో చెప్పింది కూడా ఏమి లేదు, రచయత ఆత్మలను పిలవడం, వాటితో మాట్లాడం...ఇలాంటివి ఉన్నాయ్ :(
another variant of yours, why am 'I' lingers in my mind....వీలు కుదిరితే రాజ్ గారు చెప్పినట్టు ట్రైచేసి చూస్తా
'నేను' ఏమిటో మీరే చెప్పాలి నాకు :)
@nagarjuna గారు: why am I? సంగతి తెలీదుగానీ మొత్తం ప్రాచ్య తత్వశాశ్త్రం Who am I? ని నిర్చచించడంచుట్టూ తిరుగుతుంది అని ఎవర్ చెప్పగా విన్నాను (లేక చదివానేమో).
@శరత్ 'కాలమ్' గారు: నా "నేను" గురించి తెలుసుకున్నాక మీ 'నేను' గురించి ఆలోచిస్తాలెండి.
ఒక రెండేళ్ళ క్రితం నాకు చాలా కావలసిన మనిషి దూరమయిపోయారన్న బాధలో NDE ల గురించి బాగా చదివాను. మీరు పైన చెప్పిన పరిశోధన గురించి చదివాను. ఇంచుమించు అవే పాయింట్లు చదివానులెండి. అప్పట్లో నాకు ఇలాంటి ఒక సందిగ్ధావస్తే ఏర్పడింది. మనల్ని బాగా ప్రభావితం చేసి మరణానికి దగ్గరయినా మరువలేని అంశాలేమిటి అన్నది నా ప్రశ్న. బహూశా మీ ప్రశ్న నేను అంటే ఏమిటి అన్నది దీనికి దగ్గరగా ఉందేమో కదా.
పైన చెప్పిన వారి వారి అనుభవలాను బట్టి చూస్తూ ఉంటే...జీవించినంత కాలం వారు ఎక్కువగా ఎవరిని నమ్మారో, లేదా మనసులో ఎక్కువగా ఎవరిని నిలుపుకున్నారో అవే వారి అనుభవంలోకి వచ్చాయనిపిస్తుంది కదూ. కుటుంబం పై అమితమైన ప్రేమ ఉన్నవారికి బంధువులు, దేవుని పై నమ్మకం ఉన్నవారికి దేవుడు, లేదా చనిపోయాక దివ్య తేజస్సు వస్తుంది అని నమ్మినవారికి అది, లేదా చనిపోయాక శరీరాన్ని విడిచి ఆత్మ గాల్లో ఉంటుంది అనుకున్నవారికి గాలిలో తేలినట్టుగానూ అనిపించిందేమో...ఇవి జస్ట్ నాఊహలు మాత్రమే.
అసలు విషయం వదిలేసి సోది రాస్తుందేమిటబ్బా అనుకుంటున్నరేమో నాకు తెలిస్తేగా మీకు చెప్పడానికి :)...నేను ఎవరిని?
ఆ.సౌమ్య గారు: మరణశయ్యమీద కూడా గుర్తుకు వచ్చేది మనం చేసిన తీవ్రమైన తప్పులు, వాటివల్ల బాధపడిన వ్యక్తులు, మనం అమితంగా ప్రేమించిన వ్యక్తులు, మనచేత అమితంగా ప్రేమించబడే వ్యక్తులేనండీ.
"కుటుంబం పై అమితమైన ప్రేమ ఉన్నవారికి బంధువులు, దేవుని పై నమ్మకం ఉన్నవారికి దేవుడు, లేదా చనిపోయాక దివ్య తేజస్సు వస్తుంది అని నమ్మినవారికి అది, లేదా చనిపోయాక శరీరాన్ని విడిచి ఆత్మ గాల్లో ఉంటుంది అనుకున్నవారికి గాలిలో తేలినట్టుగానూ అనిపించిందేమో...ఇవి జస్ట్ నాఊహలు మాత్రమే"
On the contrary, చాలా మమది వాటన్నిటినీ చూశారటండీ. in fact, వీటిలో ఎన్ని అనుభమవంలోకి వచ్చాయి అనదాన్ని బట్టి అది NDEనా లేక కేవలం భ్రమ/కలా అని నిర్ధారిస్తారట చూడుడు Greyson NDE Scale.
అదంతా అలావుంచండి. Astral Travel అని వెదికితే టన్నులకొద్దీ సమాచారం దొరుకుతుంది నెట్‌లో.
Post a Comment